తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రెవిన్యూ చట్టానికి సంఘీభావంగా వరంగల్ అర్బన్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఐనవోలు క్రాస్ రోడ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్త రెవిన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ - కొత్త రెవిన్యూ చట్టం
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవిన్యూ చట్టానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ర్యాలీని ప్రారంభించారు
కొత్త రెవిన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
దాదాపు వేయి ట్రాక్టర్లతో ఈ ర్యాలీని విజయవంతంగా చేపట్టారు.ఈ ర్యాలీలో మంత్రితో పాటు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, తెరాస నాయకులు పాల్గొన్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో నేతలు పాల్గొంటారు.