తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులతో కళకళలాడుతున్న వేయి స్తంభాల గుడి

78 రోజుల తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఆలయ ప్రవేశం వద్దే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ.. శానిటైజర్లు ఇస్తూ గుడి లోపలికి పంపిస్తున్నారు.

1000 pillers temple reopen
భక్తులతో కళకళలాడుతున్న వెయ్యి స్థంభాల గుడి

By

Published : Jun 8, 2020, 11:31 AM IST

కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు మూతపడి ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ వేయి స్తంభాల ఆలయాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ రోజు తెరిచారు. చాలా రోజుల తర్వాత గుడి తెరవడం వల్ల వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి థర్మల్ స్క్రీనింగ్ చేశాకే లోపలికి పంపిస్తున్నారు. శానిటైజర్లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. ఒక్కొక్కరికి మధ్య ఆరడుగుల దూరం ఉండేలా వృత్తాలు గీశారు. అంతరాయ ప్రవేశం, శఠగోపం,తీర్థ వినియోగం ఆపివేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలను ఆలయానికి అనుమతించడం లేదు. కరోనా వైరస్ సందర్భంగా భక్తులు అందరూ విధిగా నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.

ఇవీ చూడండి:కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష

ABOUT THE AUTHOR

...view details