వరంగల్ మహానగర పాలక సంస్థ నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. లాల్ బహదూర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రానికి అభ్యర్థులు ఒక్కొక్కరుగా తరలివచ్చి... తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పిస్తున్నారు. 21వ డివిజన్ తెరాస అభ్యర్థిగా ఉజ్మఖాతున్, 25వ డివిజన్ తెరాస అభ్యర్థిగా బస్వారాజు శిరీష నామినేషన్ దాఖలు చేశారు.
రెండో రోజు కొనసాగుతోన్న నామినేషన్ల ప్రక్రియ
వరంగల్ మహానగర పాలక సంస్థ నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థులు ఒక్కొక్కరుగా తరలివచ్చి తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పిస్తున్నారు.
వరంగల్ నగర పాలక సంస్థ నామినేషన్ల ప్రక్రియ
40వ డివిజన్ నుంచి గడ్డం యుగేందర్, స్రవంతి, 28వ వార్డు నుంచి మర్రి రాజకుమారి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:'టీఎంసీ విచ్ఛిన్నం.. దీదీ ఓటమే తరువాయి!'