ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్ వద్ద సీపీఎం ఆందోళన చేపట్టింది. 5 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆందోళనలు చేస్తున్న సీపీఎం శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
సీపీఎం నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు - సీపీఎం నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ వద్ద ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చాలని కోరుతూ... సీపీఎం నాయకులు ధర్నా చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు.
సీపీఎం నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు