కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని తెజస అధ్యక్షులు కోదండరాం మరోసారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి జరిగిందని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులు ముఖ్యమంత్రికి పట్టణం లేదంటూ మండిపడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మన రాష్ట్రంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా భద్రతను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా పరీక్షలు పెంచి.. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.