తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ అర్బన్ జిల్లాలో పట్టభద్రుల పోలింగ్​కు ఏర్పాట్లు - mlc elections polling arrangements in Warangal

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​కు వరంగల్ అర్బన్ జిల్లా సిద్ధమవుతోంది. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. అధికారులు దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.

telangana-graduate-mlc-elections-polling-arrangements-in-warangal-urban-district
వరంగల్​ అర్బన్ జిల్లాలో పట్టభద్రుల పోలింగ్​కు ఏర్పాట్లు

By

Published : Mar 13, 2021, 11:41 AM IST

రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీకి వరంగల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 100 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 66వేల379 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పట్టభద్రుల పోలింగ్​కు ఏర్పాట్లు

ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు 521 మంది సిబ్బందిని అధికారులు నియమించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం 120 మంది సిబ్బందిని నియమించారు. నల్గొండకు బ్యాలెటు బాక్సులను తరలించేందుకు 14 రూట్లను ఎంపిక చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్​కు ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details