ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాష్ట్ర సాధనలో టీఎన్జీవోస్ నాయకులు ముఖ్య భూమిక పోషించారని.. తప్ప కుండా ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని భరోసానిచ్చారు. త్వరలోనే కారం రవీందర్ రెడ్డికి మంచి పదవి లభిస్తుందని తెలిపారు.
'ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా'
ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో టీఎన్జీవోస్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం, కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో.. కారం రవీందర్ రెడ్డిని, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ను అతిథులు ఘనంగా సన్మానించారు. తొలుత కౌన్సిల్ సమావేశంలో 15 ప్రతిపాదనలు చేసి టీఎన్జీవోస్ నాయకులు వాటిని వినయభాస్కర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ చీఫ్‌విప్ దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్న వినయ్ భాస్కర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి:క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడమే ముఖ్యం ఈటల