తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరంగల్​కు మరిన్ని సంస్థలు వచ్చేందుకు కృషిచేస్తాం' - ktr warangal tour

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరించాల్సిన అవసరం ఉందని టెక్​ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ, సైయంట్​ ఛైర్మన్​ బీవీఆర్​ మోహన్​రెడ్డి అన్నారు. వరంగల్​కు మరిన్ని కంపెనీలు వచ్చేందుకు తాము కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

tecj mahendra ceo and saint chairman on warangal it inaugaration
'వరంగల్​కు మరిన్ని సంస్థలు వచ్చేందుకు కృషిచేస్తాం'

By

Published : Jan 7, 2020, 7:53 PM IST

వరంగల్​లో ఐటీ సంస్థను నెలకొల్పడం ద్వారా తమ కల సాకారమైందని టెక్ మహేంద్రా సీఈవో సీపీ గుర్నానీ, సైయంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్​రెడ్డి అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ మరింత విస్తరించాలని గుర్నానీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వరంగల్​ వచ్చేందుకు హెలికాప్టర్​ సేవలు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. వరంగల్​లో తమ సంస్థను మరింత అభివృద్ధి చేసి, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌తో పనిచేసి బీడు భూముల్లో నీళ్లు పారించారని మోహనరెడ్డి కొనియాడారు. ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించకపోతే అక్కడి వారికి అన్యాయం జరిగినట్టేనని అభిప్రాయపడ్డారు. సాంకేతికత వేగంగా వృద్ధి చెందుతోందని, యువత అందిపుచ్చుకోవడం ద్వారా మరింత మందికి ఉద్యోగాలు వస్తాయని గుర్నానీ తెలిపారు. మిగతా కంపెనీలు రాక కోసం తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

'వరంగల్​కు మరిన్ని సంస్థలు వచ్చేందుకు కృషిచేస్తాం'

ఇవీచూడండి: టెక్ కేంద్రంగా ఓరుగల్లు: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details