కరోనా వల్ల వరంగల్ ఆర్టీసీ కొంత నష్టాలను చవిచూసిందని ఆర్టీసీ సంస్థ కరీంనగర్-హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ మునిశేఖర్ అన్నారు. ఈడీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వరంగల్ రీజియన్‌ను సందర్శించారు.
'అధికారులు, సిబ్బంది కృషితో ఆర్టీసీ ఆదాయం పెంపు' - corona effect on Telangana rtc
కార్మికుల సమ్మె, కరోనా వల్ల నష్టపోయిన ఆర్టీసీ ఆదాయం పెంచడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ సంస్థ కరీంనగర్-హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ అన్నారు. వరంగల్ రీజియన్‌ను సందర్శించారు.
ఆర్టీసీ ఆదాయం పెంపు
ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు అధికారులతో పాటు సిబ్బంది కృషి చేయాలని మునిశేఖర్ అన్నారు. డిపోల వారీగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలని సూచించారు. కార్గో సర్వీసులను మరింత విస్తరించి.. రానున్న రోజుల్లో ఇంటింటికి కార్గో, కొరియర్, పార్శిల్ సేవలను అందిస్తామని తెలిపారు.
- ఇదీ చూడండి :రాష్ట్రంలో.. కొత్తగా 609 కరోనా కేసులు, 3 మరణాలు