తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - Warangal latest news

వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో, సమగ్ర కార్యాచరణతో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ, పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ గురించి జిల్లా నాయకులతో చర్చించారు.

State Planning Commission Vice Chairman Boinapalli Vinod Kumar on Saturday toured Hanmakonda in Warangal Urban District.
'వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

By

Published : Sep 12, 2020, 9:54 PM IST

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పర్యటించారు. ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్, జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రవేశ పెట్టిన రెవెన్యూ చట్టం, ఇతర బిల్లుల గురించి పార్టీ నాయకులకు కూలంకషంగా వివరించారు.

రెవెన్యూ చట్టం ద్వారా దశాబ్దాల నుంచి ఉన్న భూ తగాదాలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పారు. త్వరలో రానున్న మున్సిపాలిటీ, పట్టభద్రుల నియోజక వర్గ ( నల్గొండ, ఖమ్మం, వరంగల్ ) ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ గురించి చర్చించారు. కార్యకర్తలు దృఢ సంకల్పంతో క్రమశిక్షణతో పని చేయాలనీ, గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని సూచించారు.

ఇవీచూడండి:'ప్ర‌జ‌ల‌ గుండెల్లో సీఎం కేసీఆర్​ చిర‌స్థాయిగా నిలిచిపోతారు'

ABOUT THE AUTHOR

...view details