Sankranthi Pindi Vantalu: కష్టమనుకుంటే ఏదీ చేయలేం... కానీ అదే ఇష్టంగా భావించి కృషి చేస్తే విజయం దానంతట అదే వస్తుందనడానికి నిదర్శనం ఈ నలుగురు నారీమణులు. వరంగల్‌కు చెందిన ఉమాదేవి, రమాదేవి, ఉషారాణి, అర్చనలు.... పెళ్లి చేసుకుని వంటింటికే పరిమితం కాకుండా... పాకశాస్త్రాన్నే ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. తెలుగు సంప్రదాయ పిండి వంటకాలు నేటి తరం మరచిపోకూడదనే ఉద్దేశంతో... శ్రీనిధి తెలంగాణ పిండివంటలశాలను ఏర్పాటు చేశారు. 2016లో నలుగురుతో ప్రారంభించిన ఈ శాలలో ఇప్పుడు 70 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరు సకినాలు, పల్లిగారెలు, పప్పుగారెలు, పల్లిఉండలు, సర్వపిండి, మడుగులు, అరిసెలు అన్ని రకాల పిండివంటలు తయారుచేస్తూ... విదేశాలతోపాటు వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారు.
సకినాలకు డిమాండ్ ఎక్కువ
పిండివంటలపై ఆసక్తి ఉన్నా.. చాలామంది బిజీ లైఫ్‌లో పడిపోయి ఓపిక లేకపోవడంతో చేసుకోవడం లేదు. అందుకే వారి కోసం మేం ఆర్డర్ల మీద చేస్తాం. పండగ సమయంలో మా వ్యాపారం చాలా బిజీగా ఉంటుంది. ఈ సమయంలో సకినాల గిరాకీ ఎక్కువ ఉంటుంది. సమయం అంతగా లేకపోవడంతో కేజీ చొప్పున అందిస్తున్నాం. ---రమాదేవి, పిండివంటలశాల నిర్వాహకురాలు
మన సంప్రదాయ వంటకాలను ముందు తరాలకు అందించడం కోసమే కృషి చేస్తున్నాం. బిజీ జీవితంలో పిండివంటలు చేసుకోలేని వారి కోసం ఆర్డర్ల మీద సమయానికి అందిస్తున్నాం. మగవారిపై ఆధారపడకుండా మహిళలు ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. గౌరవంగా ఉండే ఏ పని చేసుకున్నా తప్పు లేదు. ---ఉమాదేవి, పిండివంటల శాల నిర్వాహకురాలు
నాణ్యతకు అధిక ప్రాధాన్యం