వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నక్కలగుట్టలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం కన్న తల్లిని కిరాతకంగా కొట్టి చంపాడో కొడుకు. వినాయక నగర్లో నివాసం ఉంటున్న బాలమణి రైల్వే ఉద్యోగం చేసి పదవి విరమణ పొందారు. ఆమె కుమారుడు రేవంత్ డబ్బుల కోసం తల్లిని నిత్యం వేధించసాగాడు. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాగి వచ్చి డబ్బుల కోసం గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖం, ఛాతిపై దారుణంగా కొట్టాడు. బాలమణి అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు - గొడవ
పెన్షన్ డబ్బుల కోసం కన్న తల్లిని కిరాతకంగా కడతేర్చాడో కొడుకు. 60 ఏళ్ల తల్లిని ముఖం, ఛాతిపై దారుణంగా కొట్టి చంపేశాడు.
పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు