తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో సింగిడి హరివిల్లు సందడి

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వరంగల్​లోని కాకతీయ యూనివర్సిటీలో సింగిడి హరివిల్లు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలనాటి జానపద గీతాలు, తెలంగాణ ఉద్యమపోరును వివరిస్తూ విద్యార్థులు నృత్యాలతో  సందడి చేశారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో సింగిడి హరివిల్లు సందడి

By

Published : Feb 9, 2019, 11:37 PM IST

సింగిడి హరివిల్లు సందడి
తెలంగాణ కళలు, సంస్కృతులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు అఖిల భారత విద్యార్థి పరిషత్‌ శ్రీకారం చుట్టింది. సింగిడి కళల హరివిల్లు పేరుతో రెండురోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి వరంగల్ కాకతీయ యూనివర్శిటీ వేదికైంది. సాంప్రదాయ జానపద గీతాలు, ఉద్యమపోరును వివరించే పాటలకు విద్యార్థులు నృత్యాలు చేస్తూ అలరించారు.
సంప్రదాయ వస్త్రదారణలో విద్యార్థులు జానపద,శాస్త్రీయ సంగీతానికి లయబద్దంగా నృత్యాలు చేస్తూ ఉర్రూతులూగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు వేయి మంది కళాకారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details