వరంగల్ అర్బన్ జిల్లాలో పోలీస్ ఎస్సై అభ్యర్థుల రాత పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. నిమిషం ఆలస్యం నిబంధన ఉండడం వల్ల గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 95 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కమిషనర్ తెలిపారు.
ఎస్సై పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కమిషనర్ - exam
వరంగల్లో ఎస్సై రాత పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్ష కేంద్రాలను నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ పరిశీలించారు.
ఎస్సై పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కమిషనర్