వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్, సోమిడి గ్రామానికి చెందిన మేకల కేదారి యాదవ్ రమాదేవి దంపతులు గో ప్రేమికులు. గతేడాది పుంగనూరు మేలు జాతికి చెందిన ఆవులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందులోని ఒక ఆవు గర్భిణిగా ఉండటంతో ఇరుగుపొరుగు వారిని, బ్రాహ్మణ పండితులను పిలిచి డప్పుచప్పులతో గోమాతకు సీమంతం చేశారు. పూలతో అలంకరించి నూతన వస్త్రాలను కప్పి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా వేడుక జరిపించారు.
కన్నులపండువగా గోమాతకు సీమంతం - సోమిడిలో ఆవుకు సీమంతం
ముక్కోటి దేవతలు కొలువు దీరే గోమాతను పూజించటం మన సంస్కృతీసంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ... తాము పెంచుకుంటున్న గోమాత గర్భంతో ఉండగా.. సీమంతం చేసి భక్తిని చాటుకున్నారు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన దంపతులు.
సోమిడిలో ఆవుకు సీమంతం
ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించినట్లు యాజమాని తెలిపారు. గోమాతకు సీమంతం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని దంపతులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వరదల్లో నేలకూలింది.. వాకర్ల సాయంతో ప్రాణం పోసుకుంది.!