తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులను సంఘటితం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం' - rythu vedika buildings in warangal urban district

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం రామారంలో రైతు వేదిక నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

rythu-vedika-building-at-ramaram-in-warangal-urban-district
రామారంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పర్యటన

By

Published : Sep 4, 2020, 1:46 PM IST

ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ భూముల్లోనే రైతు వేదిక భవన నిర్మాణాలను చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం రామారంలో పర్యటించారు.

రైతు వేదిక భవన నిర్మాణాలను పరిశీలించారు. రైతులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కర్షకులందర్ని సంఘటితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details