ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ జిల్లా జడ్జి తిరుమలదేవి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండలోని జిల్లా కోర్టులో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని కోరారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి అంబెడ్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హన్మకొండలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ
అందరూ మొక్కలు నాటాలని నినదిస్తూ హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి.. పర్యావరణాన్ని సంరంక్షించాలని వరంగల్ జిల్లా జడ్జి తిరుమలదేవి అన్నారు.
హన్మకొండలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ