తొమ్మిది నెలల చిన్నారిని అత్యాచారం చేసి హత్యచేసిన కామోన్మాదిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని కోరుతూ వరంగల్లో యువత ఆందోళన చేపట్టింది. దుర్మార్గుడి చేతిలో బలైన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ హన్మకొండలోని అశోక కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించగా... మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. చిన్నారి ఘటనను ఖండిస్తూ... నిందితున్ని బహిరంగంగా ఉరి తీయాలని యువకులు డిమాండ్ చేశారు.
'నిందితున్ని బహిరంగంగా ఉరి తీయాలి' - CULPRIT HAS TO BE HUNG IN FRONT OF PEOPLE DEMANDED WARANGAL YOUTH
చిన్నారిని చిదిమేసిన నరరూప రాక్షసున్ని ప్రజల మధ్యే బహిరంగంగా ఉరి తీయాలని ముక్తకంఠంతో హన్మకొండలో యువత నినదించింది. అమ్మాయి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది.
CULPRIT HAS TO BE HUNG IN FRONT OF PEOPLE DEMANDED WARANGAL YOUTH