దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీయే రావాలని కోరుకుంటూ వరంగల్ అర్బన్ జిల్లాలో రాజ శ్యామల యాగం నిర్వహించారు. హన్మకొండలోని విష్ణు ప్రియ గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఐదేళ్ల మోదీ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. ఆర్థిక పరిపాలన, సంస్కరణలను తీసుకొచ్చి దేశ అభివృద్ధికి దోహద పడ్డారని కొనియాడారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీయే అధికారంలోకి రావాలన్నారు. ఈ యాగంలో భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.
మోదీ కోసం రాజశ్యామల యాగం - RAJASHYAMALA YAGAM
నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటూ హన్మకొండలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. భాజపా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిపించారు.
మోదీ కోసం రాజశ్యామల యాగం