వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జోరుగా వర్షం కురిసింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్లోని తదితర ప్రాంతాల్లో... రాళ్లతో కూడిన వర్షం పడింది. సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
వాతావరణాన్ని చల్లబరిచిన వానమ్మ - వరంగల్లో వర్షపు జల్లులు
వరంగల్ నగరంలో దాదాపు రెండు గంటల పాటు వర్షం కురిసింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
వరంగల్లో వర్షపు జల్లులు
పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మురికి కాలువలు పొంగి పొర్లాయి. గత కొన్ని రోజులుగా ఎండ వేడిమికి అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.
ఇవీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు