తెలంగాణ

telangana

ETV Bharat / state

'భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు జరుగుతాయ్​' - జల సంరక్షుడు రాజేంద్రసింగ్​ తాజా వార్త

నీటి వనరులను సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రామన్​మెగసెస్​ పురస్కార గ్రహీత రాజేంద్ర సింగ్​ అన్నారు. వరంగల్​లో నిట్​ కళాశాలలో గోదావరి జలసంరక్షణ యాత్ర అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

Raaman_Megasaysay_Awardee_Programe_In_warangal Nit collage
'భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు జరుగుతాయ్​'

By

Published : Feb 19, 2020, 1:00 PM IST

ప్రకృతి సిద్ధమైన నీటి వనరుల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే 21 వ శతాబ్దంలో నీటి సంక్షోభం సంభవిస్తుందని జలసంరక్షకుడు, రామన్ మెగాసెస్ పురస్కార గ్రహిత రాజేంద్ర సింగ్ తెలిపారు. గోదావరి జలసంరక్షణ యాత్ర అనే అంశంపై వరంగల్​లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్​లో ఆయన ప్రసంగించారు.

నీటి వనరుల సంరక్షణ ప్రపంచ వ్యాప్త సమస్యగా గుర్తించారని... కానీ దానికి పరిష్కారం మాత్రం స్థానికంగానే ఉందన్నారు. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేసి భూగర్భజలాలను పెంచుకోవడం ద్వారానే నీటి సమస్యలను అదిగమించవచ్చని ఆయన తెలిపారు. నీటి సంరక్షణపై ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని... లేకుంటే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

'భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు జరుగుతాయ్​'

ఇదీ చూడండి :జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!

ABOUT THE AUTHOR

...view details