సీజనల్ వ్యాధులను నివారించే చర్యల పట్ల పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం కలిగించాలని సూచించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: మంత్రి ఈటల - మంత్రి ఈటల
సీజనల్ వ్యాధుల నివారణ చర్యల పట్ల పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: మంత్రి ఈటల