తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2021, 4:51 PM IST

ETV Bharat / state

నల్లానీళ్లు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో నిరసన

నెల రోజులుగా నల్లానీళ్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వరంగల్​ అర్బన్​ జిల్లా కొత్తపల్లి తండావాసులు ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

Protest with empty bins
ఖాళీ బిందెలతో మహిళల నిరసన

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి తండావాసులు ఆందోళనకు దిగారు. గత నెల రోజులుగా నల్లానీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖాళీ బిందెలతో గ్రామంలోని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

నీళ్ల కోసం మహిళల అవస్థలు

నల్లా నీళ్లు రాకపోవడం వల్ల ప్రతిరోజు కిలోమీటర్ మేర నడిచి వ్యవసాయ బావుల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు రావడం లేదని సర్పంచ్​, గ్రామ పంచాయతీ సిబ్బందికి పలుమార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఎన్​ఐఏ చట్టాన్ని రద్దు చేయాలి: ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సమితి

ABOUT THE AUTHOR

...view details