వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో తెరాస నుంచి టికెట్లు ఆశించిన వారికి... ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వారంతా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆశావాదులు మంగళవారం ధర్నాకు దిగారు. మైనార్టీ నాయకుడు మసూద్‌కు కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వాలంటూ ఆయన వర్గానికి చెందినవారు డిమాండ్ చేశారు.
టికెట్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా
మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వాలని తెరాసకు చెందిన ఆశావహులు... వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఇంటి ముందు మంగళవారం ధర్నాకు దిగారు. మరోవైపు ఓ మాజీ కార్పొరేటర్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయనకు అవకాశం ఇవ్వొద్దంటూ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు.
http://10.10.50.85:6060/reg-lowres/20-April-2021/tg-wgl-16-20-mla-inti-muttadi-ab-ts10076_20042021163203_2004f_1618916523_346.mp4
మరోవైపు 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని... ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానికులు ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సానుకూలంగా ఉండడాన్ని నిరసిస్తూ ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు.
ఇదీ చదవండి:ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి నేటి నుంచి బియ్యం పంపిణీ