దేశంలో మార్పు తీసుకురావటానికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రధాని పదవిపై కోరిక లేదని కేసీఆర్ వరంగల్ ప్రచార సభా వేదికగా స్పష్టం చేశారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ దేశంలోనే మెుదటి స్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చేది తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. గత ఐదేళ్లలో వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు.
ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు: కేసీఆర్
ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వరంగల్ ప్రజలు చైతన్యవంతులు,ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందో చూసి స్ఫూర్తి దాయకమైన తీర్పు ఇవ్వాలన్నారు.
ప్రధాని కావాలనే కోరిక లేదు: కేసీఆర్