పాలీసెట్ పరీక్ష వరంగల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. వరంగల్ నగరంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 10 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. గంట ముందుగానే విద్యార్థులను లోపలికి పంపించారు. పరీక్ష సజావుగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి వారిని ప్రోత్సాహించారు.
విద్యార్థులను ప్రోత్సాహించేదుకు వచ్చిన తల్లిదండ్రులు - diploma
పాలీసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. విద్యార్థులను గంట ముందే కేంద్రంలోని అనుమతించారు. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపించారు.
పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు