వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పోలియో కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని కమిషనర్ సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 94,214 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉండగా.. 2,394 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని జిల్లా అధికారులు తెలిపారు. అర్బన్ ప్రాంతంలో 299, గ్రామీణ ప్రాంతాల్లో 270 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనూ పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
'ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలను వేయించాలి' - వరంగల్ తాజా వార్త
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పల్స్ పోలియో కేంద్రాన్ని గ్రేటర్ వరంగల్ నగరపాలక కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు.
'ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలను వేయించాలి'