వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ అర్బన్ జిల్లాలోని వ్యవసాయదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో చెరువులు, బావులలో నీరు సమృద్ధిగా చేరడం వల్ల రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో వరినాట్లు జోరందుకున్నాయి. నెల రోజుల క్రితమే వరినాట్లు పూర్తి కావాల్సి ఉండగా సరైన వర్షపాతం లేక చాలా మంది రైతులు నాట్లు ప్రారంభించలేదు. ఇప్పుడు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడం వల్ల రైతులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ కూలీలు కూడా చేతినిండా పని దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో రైతుల్లో ఆనందం - వరంగల్
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చెరువులు, బావులలో నీరు సమృద్ధిగా చేరడం వల్ల వరంగల్ అర్బన్ జిల్లా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
వరంగల్