వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రెండో వ్యాక్సిన్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదటి సారి టీకా తీసుకున్న వారు రెండో టీకా కోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోటెత్తుతున్నారు. అక్కడ సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యాక్సిన్ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పోటెత్తిన జనాలు - హన్మకొండ ప్రజల ఇబ్బందులు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కరోనా రెండో డోసు టీకా కోసం ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోటెత్తుతున్నారు. కరోనా పరీక్షలు కూడా అక్కడే చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా టీకా కోసం ప్రజల ఎదురుచూపులు
వ్యాక్సిన్ కోసం కొవిడ్ నియమాలు కూడా పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు. ఇదే కేంద్రంలో కరోనా పరీక్షలు కూడా చేస్తుండటంతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి:కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా