వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. నగరంలోని స్పెక్ట్రా గ్లోబల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ముఖేశ్ అనే విద్యార్థి శుక్రవారం సాయంత్రం నుంచి కనపడకుండా పోయాడు. పాఠశాల యాజమాన్యం ఎంత వెతికినా కనబడకపోవడం వల్ల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాల నిర్లక్ష్యం వల్ల తమ బాబు కనబడకుండా పోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి పాఠశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నడాని చెప్పారు. గతంలో పనిచేసిన దినేశ్ అనే వార్డెన్ తీసుకెళ్లి ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వార్డెన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. తమ బాబు తమకు కావాలని పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
మా బాబు మాకు కావాలి: తల్లిదండ్రుల ఆందోళన - వరంగల్ అర్బన్ జిల్లా
హన్మకొండలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తమ కుమారుడు తమకు కావాలని స్కూల్ ముందు బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
మా బాబు మాకు కావాలి: తల్లిదండ్రుల ఆందోళన