పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వాకింగ్‌కు వచ్చారు. వాకర్స్‌తో కాసేపు మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రతి రోజూ ఎంత మంది నడుస్తున్నారు? ప్రస్తుతం ఉన్న సదుపాయాలు ఎంటి? ఇంకా ఏమేమి కావాలి? అని అడిగి తెలుసుకున్నారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వాకింగ్ ట్రాక్ : ఎర్రబెల్లి - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో త్వరలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన కాలేజీ మైదానంలో వాకింగ్‌కు వచ్చారు.
వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం: ఎర్రబెల్లి
మార్నింగ్ వాకర్స్ కోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో పబ్లిక్ గార్డెన్స్, మరికొన్ని చోట్ల కూడా వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే అర్ఈసీ ముందు సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజావసరాల కనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఇదీ చదవండి:40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!