తెలంగాణ

telangana

ETV Bharat / state

Palla Rajeshwar Reddy To MLA Rajaiah House : పల్లా రాజేశ్వర్​ రెడ్డిని కలవడానికి నిరాకరించిన రాజయ్య.. 'ఎలాగైనా ఘన్​పూర్​ మాదే' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Palla Rajeshwar Reddy To MLA Rajaiah House : స్టేషన్ ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్యను కలవడానికి హన్మకొండలోని నివాసానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లారు. ఎమ్మెల్యే రాజయ్య అందుబాటులో లేకపోవడంతో ఆయన అనుచరులతో సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలుస్తామన్నారు. రాజయ్య, కడియం శ్రీహరి, తాను కలిసి స్టేషన్ ఘన్​పూర్​ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Rajaiah Vs Palla Rajeshwar Reddy
Palla Rajeshwar Reddy To MLA Rajaiah House

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 4:01 PM IST

Palla Rajeshwar Reddy To MLA Rajaiah House : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాను ఈనెల 21న సీఎం కేసీఆర్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి స్టేషన్​ ఘన్​పూర్​ సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య(MLA Rajaiah)ను కాదని.. కడియం శ్రీహరికి ఆ టికెట్​ను బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ కేటాయించారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న రాజయ్య.. ​పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలను కలుసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టేశారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చిన.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి(Palla Rajeshwar Reddy) ఆయనను కలిసేందుకు తన నివాసానికి వెళ్లారు.

Rajaiah Vs Palla Rajeshwar Reddy :హన్మకొండలోని రాజయ్య ఇంటికి వెళ్లిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి.. ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో పల్లాను కలవడానికి ఎమ్మెల్యే రాజయ్య నిరాకరించినట్లు తెలుస్తోందని సమాచారం. అనంతరం అక్కడ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యే అనుచరులతో సమావేశమయ్యారు. అక్కడి రాజయ్య అనుచరులతో.. పార్టీ అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లోనే సీఎం కేసీఆర్​ను కలుస్తామని తెలిపారు. ఈసారి ఎలాగైనా స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి, తాను కలిసి గులాబీ జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నామని పల్లా రాజేశ్వర్​ రెడ్డి వెల్లడించారు.

Political Analysis on Reasons not Giving MLA Ticket to Rajaiah : రాజయ్యకు టికెట్ రాకపోవడానికి గల కారణాలు ఇవేనా?

రాజయ్యకు టికెట్​ ఇవ్వకపోవడానికి గల పూర్తి సమాచారం : ఒకేసారి ముఖ్యమంత్రి కేసీఆర్​ 115 మందితో కూడిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏడు సిట్టింగ్​ స్థానాలను మార్చారు. అందరూ అనుకున్నట్లే ఓరుగల్లులోని స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గం స్థానాన్ని సిట్టింగ్​ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి కట్టబెట్టారు. చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య కోల్డ్​వార్​ నడుస్తోందనే విషయం తెలిసిందే. ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. ఆ తర్వాత ఆయనపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. జానకీపురం సర్పంచ్​ నవ్య.. రాజయ్యపై లైంగిక ఆరోపణలు చేశారు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారి.. సీఎం కేసీఆర్​ వరకూ వెళ్లింది. దీంతో రాజయ్యను పిలిచి.. సీఎం మందలించారు. సర్పంచ్​ నవ్య అక్కడితో ఆగకుండా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు.. పోలీసులు విచారణ చేసి తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల వల్లే రాజయ్యకు ఈసారి టికెట్ నిరాకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

MLA Rajaiah vs Sarpanch Navya Controversy : ఎమ్మెల్యే రాజయ్య Vs సర్పంచ్ నవ్య.. వివాదంలో కొత్త మలుపు

Political Analysis on Reasons not Giving MLA Ticket to Rajaiah : రాజయ్యకు టికెట్ రాకపోవడానికి గల కారణాలు ఇవేనా?

BRS Political War in Jangaon District : జనగామలో రోడ్డెక్కిన బీఆర్​ఎస్​ రాజకీయం.. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల తంటా

ABOUT THE AUTHOR

...view details