old woman was robbed of gold in Hanmakonda: పల్లెల్లో వృద్ధుల అమాయకత్వమే నేరగాళ్లకు ఓ వరం. అప్పుడప్పుడు గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు వచ్చి.. మీకు ఆఫర్ తగిలింది... ఫలానా వస్తువు మీకు ఉచితంగా వస్తుందని.. మీ దగ్గరున్న సరుకును మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు తీసుకుంటాం.. అనో మభ్యపెడుతుంటారు. మీ ఊరి ఫలానా వ్యక్తి తెలుసంటూ బుకాయిస్తుంటారు.
నమ్మకం కలిగే విధంగా కల్లబొల్లి మాటలతో ఊరిస్తారు. పల్లెల్లోని అమాయకులు, వృద్ధులు వారిని నిజంగానే నమ్మి వారు చెప్పినట్లు చేస్తుంటారు. సదరు వ్యక్తి బురిడి కొట్టిస్తున్నాడని తెలుసుకునేలోపు జరగాల్సిన మోసం జరిగిపోతుంది. ఇలాంటి మోసమే హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. లేని పోని మాయ మాటలు చెప్పి అమాయకమైన వృద్ధురాలి మెడలోంచి చెప్పి రెండున్నర తులాల బంగారాన్ని అపహరించాడు. కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి భాగ్యమ్మ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి .. మీకు ఉచితంగా కొత్త గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఊరించాడు. హనుమకొండలో ఉంటున్న ఆమె కుమారుడు తనకు తెలుసని వృద్ధురాలు నమ్మే విధంగా మాయ మాటలు చెప్పాడు.
ఉచితంగా గ్యాస్ సిలిండర్ కావాలంటే ఫోటోలు అవసరం అవుతాయని అన్నాడు. వంటింట్లో ఉన్న ఆమెను.. ఫోటోలు స్పష్టంగా రావాలంటే ఇంట్లో చీకటిగా ఉందని వాకిట్లోకి రమ్మని పిలిచి.. పేదరాలిగా కనిపించాలంటే మెడలో ఉన్న బంగారు తాడు ఫోటోలో కనిపించొద్దని.. బంగారు తాడు తీసి పక్కన పెట్టాలని భాగ్యమ్మను నమ్మించాడు.