వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పోలింగ్ కేంద్రంలో అధికారులు కనీస వసతులను ఏర్పాటు చేయలేదు. స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో చీకటి గదిలోనే మాక్ పోలింగ్ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులను లోపలికి తీసుకువెళ్లడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పోలింగ్ మొదలైన తర్వాత కూడా తెరాస మినహా ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా కేంద్రం వద్దకు రాలేదు. తహసీల్దార్ వరలక్ష్మి, వీఆర్వో ప్రవీణ్ ఓటర్లకు పుష్పాలను అందించి స్వాగతం పలికారు.
చీకటి గదిలో పోలింగ్... ఇబ్బంది పడుతున్న ఓటర్లు
ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు... ఓటర్లకు అన్ని సౌకర్యాలు అందిస్తానన్న ఎన్నికల సంఘం పలు చోట్ల కనీస వసతులు కూడా కల్పించలేదు. వరంగల్ అర్బన్ ధర్మసాగర్లో చీకటి గదిలో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.
కనీస సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రం