వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా వరంగల్ నిట్ విద్యార్థులు అడుగులు వేశారు. హన్మకొండ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నుంచి ఇనుపరాతి గుట్టల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 30 కిలోమీటర్ల ఈ ర్యాలీలో.. జిల్లా అటవీశాఖ అధికారులు, 300మంది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖ పర్యవేక్షణ అధికారి అక్బర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.