ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వరంగల్ పట్టణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా వ్యాప్తి లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఆందోళన - తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్
వరంగల్ నగరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో సమ్మె బాట పడతామని హెచ్చరించారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఆందోళన
ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించాలని.. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో విధులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పడతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:'కరోనా నుంచి బ్యాంకు ఉద్యోగులను కాపాడండి'