తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తాజాగా 24 కొవిడ్‌ కేసులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తాజాగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాల సమయాన్ని కుదించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకే షాపులు తెరుస్తున్నారు. ఇక సెలూన్‌ షాపులను జులై 1 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తాజాగా 24 కొవిడ్‌ కేసులు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తాజాగా 24 కొవిడ్‌ కేసులు

By

Published : Jun 27, 2020, 7:08 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అర్బన్‌ జిల్లాలో 20 మందికి మహమ్మారి సోకగా.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్‌ విజృంభిస్తున్నందున వరంగల్ వర్తకులు స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను కుదించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకే దుకాణాలు తెరుస్తున్నారు.

ఇదిలా ఉంటే సెలూన్ షాపుల నిర్వాహకులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను జులై 1 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ నగరంలో కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైన ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే జరుపుతున్నారు.

ఇవీచూడండి:గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details