తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో 16 డివిజన్లలో తెరాస విజయం - పురపోరులో వెలువడుతున్న ఫలితాలు

మినీ పురపోరులో కీలకమైన వరంగల్‌ కార్పొరేషన్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు తెరాస అభ్యర్థులు 16 డివిజన్లలో గెలుపొందగా.. భాజపా మూడు చోట్ల, కాంగ్రెస్‌ రెండు, ఇతరులు ఒకచోట విజయం సాధించారు.

WGL
WGL

By

Published : May 3, 2021, 12:48 PM IST

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడుతున్నాయి. రాంపూర్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా తెరాస అభ్యర్థులు ఇప్పటికే 16 డివిజన్లలో గెలుపొందారు. భాజపా అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించగా.. కాంగ్రెస్‌ రెండు డివిజన్‌లను దక్కించుకుంది. ఇతరులు ఒక చోట విజయం సాధించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తొలి ఫలితం వెలువడింది.

వరంగల్‌లో మొత్తం 66 డివిజన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మూడు బ్లాకులుగా విభజించి 132 టేబుళ్లలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఫలితాల తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎవరైనా కొవిడ్‌ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది.

ఇదీ చూడండి:చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోను: ఈటల రాజేందర్

ABOUT THE AUTHOR

...view details