నల్లమల అడవుల యురేనియం తవ్వకాలపై కేంద్రం సర్వే జరుపుతుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమంలో సేవ్ నల్లమల అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకారం లేదనడం బాధాకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా వరంగల్ చంద్రకాంతయ్యప్ప ప్రసూతి ఆస్పత్రిలో ఎంపీతో పాటు భాజపా నాయకులు పండ్లను పంపిణీ చేశారు.
'యురేనియం తవ్వకాలపై కేంద్రం చర్యలు చేపడుతోంది' - వరంగల్
నల్లమల అడవుల యురేనియం తవ్వకాలపై కేంద్రం చర్యలు చేపడుతోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టుకు కేంద్రం సహాకారం లేదనడం బాధకరమన్నారు.
'యురేనియం తవ్వకాలపై కేంద్రం చర్యలు చేపడుతోంది'