తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా తెలంగాణ పథకాలు: కడియం శ్రీహరి

రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్​ ప్రభుత్వం ఉండాల్సిందేనని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వరంగల్​ అర్బన్ జిల్లా ధర్మసాగర్​లో మండల స్థాయి పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా, కాంగ్రెస్​లపై కడియం విమర్శలు గుప్పించారు.

kadiyam srihari
కడియం శ్రీహరి

By

Published : Mar 12, 2021, 3:34 PM IST

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరించే వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి అని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీ హరి పేర్కొన్నారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వరంగల్​ అర్బన్​ జిల్లా ధర్మసాగర్​లో మండల స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

నిర్లక్ష్యం చేసింది..

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను భాజపా విస్మరించిందని.. గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీతో పాటుగా రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని కడియం ఆరోపించారు. అటు కేంద్ర స్థాయిలోనూ... ఇటు రాష్ట్ర స్థాయిలోనూ పూర్తి స్థాయి అధ్యక్షులను నియమించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు.. తెలంగాణ అమలుచేస్తున్న పథకాలను అభినందిస్తూ తమ ప్రాంతాల్లోనూ వాటిని ప్రవేశపెడుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గతంలో తనను ఉప ముఖ్యమంత్రిగా నియమించి సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కడియం హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసది పేగుబంధం: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details