వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో టీకా కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. నగరంలోని ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హన్మకొండలోని కూరగాయల మార్కెట్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
vaccination: వరంగల్లో ప్రశాంతంగా వ్యాక్సినేషన్: ఎమ్మెల్యే వినయ భాస్కర్
వరంగల్ నగరవాసులందరికీ టీకా వేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ తెలిపారు. ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. హన్మకొండలోని కూరగాయల మార్కెట్ని పరిశీలించారు. వ్యాపారులకు టీకా కూపన్లు అందజేశారు.
ఎమ్మెల్యే వినయభాస్కర్, వ్యాక్సినేషన్
కూరగాయల వ్యాపారులకు, మటన్ షాప్ నిర్వాహకులకు టీకా కూపన్లను అందజేశారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అపోహలు వద్దని కోరారు. నగరంలో ఆరు టీకా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఇదీ చదవండి:Harish rao: మీరు ఇవ్వరు.. మమ్మల్ని కొనుగోలు చేయనివ్వరు: హరీశ్