తెలంగాణ

telangana

అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన చీఫ్​ విప్​

By

Published : Oct 4, 2020, 7:46 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ హైదరాబాద్​ తర్వాత వరంగల్​ మీదనే ప్రత్యేక దృష్టి  పెట్టారని.. త్వరలోనే వరంగల్​ నగరం పర్యాటక రాజధానిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ అన్నారు. హన్మకొండలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు.

MLA Vinay Bhaskar Inaugurates Development works in hanmakonda
అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన చీఫ్​ విప్​

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్​ తర్వాత వరంగల్​ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారని.. అందుకే ప్రతి సంవత్సరం వరంగల్​కు రూ.300 కోట్ల నిధులను అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారని అన్నారు.

వరంగల్​ జిల్లాలో దశల వారిగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. నగరంలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లాలో పనులన్ని పూర్తయిన తర్వాత వరంగల్​ నగరాన్ని కొత్తగా చూస్తారని ఆయన అన్నారు.

ఇవీ చూడండి:దుబ్బాక పోరు: అభ్యర్థి ఎంపికకు కాంగ్రెస్​ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details