ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సహకార సంఘాలు నిర్వీర్యం అయ్యాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కల్పలత సూపర్ మార్కెట్‌ను తొలగించి ప్రభుత్వానికి కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చూశారన్నారు. ఆ ప్రతిపాదనను ఖండిస్తూ ఆరేళ్ల పాటు శ్రమించి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చామని తెలిపారు. 97వ అంతర్జాతీయ సహకార సంఘాల సదస్సులో నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతకుముందు కల్పలత సూపర్ మార్కెట్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
97వ అంతర్జాతీయ సహకార సంఘాల సదస్సు
వరంగల్‌లో 97వ అంతర్జాతీయ సహకార సంఘాల సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
MLA DASYAM VINAY BHASKAR ATTENDED TO MEETING