వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హంటర్ రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే 25 మంది లబ్ధిదారులకు 25 లక్షల 2 వేల 900 రూపాయల విలువ చేసే కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు.
హన్మకొండలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ - MLA AROORI RAMESH KALYANA LAXMI CHEKCS DISTRIBUTON
ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
హన్మకొండలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేసిన 2 లక్షల 41 వేల 500 రూపాయల విలువ గల చెక్కులతో 9 మంది లబ్ధిదారులకు అందించారు. 45 మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలను ఇచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!