తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత - నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత

స్వీయ నియంత్రన పాటించి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచించారు.

mla aroori ramesh distributed daily commodities
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత

By

Published : May 7, 2020, 3:29 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం ముచ్చర్లలో లాక్​డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి బియ్యం, నూనె, పప్పులు అందజేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎవ్వరూ ఇబ్బందులు పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకు 1500 రూపాయలు ఇస్తున్నారని గుర్తు చేశారు. లాక్​డౌన్ పూర్తయ్యేవరకూ ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు.

ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

ABOUT THE AUTHOR

...view details