వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరంలో ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్థులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలను సామజిక దూరాన్ని పాటించాలని కోరారు.
ఇంటింటికీ తిరుగుతూ నిత్యావసర సరుకుల పంపిణీ
వరంగల్ రూరల్ జిల్లా రామవరంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటింటికీ తిరుగుతూ నిత్యావసర సరుకులు అందజేశారు.
ఇంటింటికీ తిరుగుతూ నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్డౌన్ కారణంగా తన నియోజకవర్గంలో ఏ ఒక్కరూ పస్తులు ఉండొద్దని… అందుకే గత మూడు వారాలుగా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణ ప్రజలకంటే పల్లె ప్రజలే లాక్డౌన్ను ఎక్కువగా పాటిస్తున్నారని ఎమ్మెల్యే రమేష్ తెలిపారు.
ఇవీ చూడండి:కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు
Last Updated : Apr 18, 2020, 8:55 PM IST