ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే వైద్యుల ఎజెండా కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. సంపాదన కంటే ప్రజల ప్రేమను పొందటమే గొప్ప సంపదగా భావించాలన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాకతీయ వైద్య కళాశాలలో... ఐఎంఏ వరంగల్ శాఖ నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.
'ఆరోగ్య తెలంగాణను తయారు చేసుకుందాం' - 'ఆరోగ్య తెలంగాణను తయారు చేసుకుందాం'
కాకతీయ వైద్య కళాశాలలో... ఐఎంఏ వరంగల్ శాఖ నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించటమే కాకుండా...ఆరోగ్య తెలంగాణను తయారు చేసుకుందామని మంత్రులు సూచించారు.
రాష్ట్రానికి ఐదు వైద్య కళాశాలు, వరంగల్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రావటం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. జబ్బు వచ్చాక నయం చేయడమే కాకుండా... అసలు రోగమే రాకుండా చూసి... ఆరోగ్య తెలంగాణను రూపొందించాలని కోరారు. వైద్య రంగానికి తెరాస సర్కార్ ఎనలేని ప్రధాన్యత ఇస్తోందని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఎంజీఎం ఆధునికీకరణ కోసం సీఎం కేసీఆర్ రూ. 5 కోట్లు మంజూరు చేశారని... తక్షణమే ఆ నిధులను విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్