వరంగల్ అర్బన్ జిల్లాలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులపై ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడారు.
రైల్వే బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి: మంత్రి ఈటల - తెలంగాణ వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న ఆర్‌ఓబీ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులపై ఆరా తీశారు.
ఆర్‌ఓబీ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి: మంత్రి ఈటల
అనంతరం కమలాపూర్ మండలంలోని గూనిపర్తి శివాలయాన్ని సందర్శించారు. శివపార్వతులను దర్శించుకొని... ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం శ్యాం, తెరాస రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.