తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర అవార్డులు: ఎర్రబెల్లి - minister errabelli dayakar

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చామని... కరోనా వల్ల ఒకటో, రెండో మిగిలిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం అవార్డులు ఇస్తుంటే... భాజపా నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister errabelli dayakar serious on bjp leaders
ఎన్నికల్లో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు నెరవేర్చాం: ఎర్రబెల్లి

By

Published : Jan 24, 2021, 6:15 PM IST

వరంగల్‌ జల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో మినీ డైరీ పైలట్‌ ప్రాజెక్టును మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​, కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో రెండొందల పింఛను కూడా ఇవ్వట్లేదని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. దేశంలోనే వంద శాతం నల్లా నీళ్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు నెరవేర్చాం: ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం అవార్డుల మీద అవార్డులు ఇస్తోందని.. అయినా సరే భాజపా నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు పూర్తి చేశామని... కరోనా వల్ల ఒకటి రెండు హామీలు మిగిలి పోయాయని తెలిపారు. మూడెకరాల భూమి పథకంపై మార్చి నెల తర్వాత కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ఎర్రబెల్లి ప్రకటించారు. గిరిజన వర్సిటీ కోసం భూమి కొనుగోలు చేసి పెట్టామన్నారు.

ఇదీ చూడండి:బుడ్డోడి ఫీట్లకు కేటీఆర్ ఫిదా.. ట్విట్టర్​లో​ అభినందనలు

ABOUT THE AUTHOR

...view details