తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2020, 10:56 PM IST

ETV Bharat / state

కొవిడ్​ సేవలపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు అందుతున్న సేవలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారి నాగార్జున రెడ్డి కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సంధ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్​ సేవలపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్​ సేవలపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగులకు అందిస్తున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సమీక్షించారు. ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ రోగుల కోసం 440 పడకలకు గాను 230 పడకలు ఖాళీగా ఉన్నాయని కార్యనిర్వాహణాధికారి తెలిపారు. కమలాపూర్​లో 40 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.

అక్టోబర్ 15 నాటికి కాకతీయ వైద్య కళాశాలలోని 230 పడకల పీఎన్​ఎస్​ఎస్​వై ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. కొవిడ్ రోగులకు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా ఎంజీఎం ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల ఫోన్ నెంబర్లను వార్డుల్లో ఏర్పాటు చేయాలని కార్యనిర్వహణ అధికారి నాగార్జున రెడ్డికి సూచించారు.

ఇదీ చూడండి:నూతన ఆబ్కారీ పోలీస్​ స్టేషన్​ను ప్రారంభించిన మంత్రులు

ABOUT THE AUTHOR

...view details